
పెద్దపసుపుల లో పల్లె పండగ వారోత్సవాలు
పెద్దముడియం, న్యూస్ వెలుగు; పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా ఈరోజు పెద్దపసుపుల గ్రామపంచాయతీ మరియు జై కొత్తపల్లి గ్రామపంచాయతీలందు ఉపాధి హామీ నిధులతో చేపట్టబోయే పనులకు భూమి పూజ స్థానిక సర్పంచ్ శ్రీమతి కే నిర్మల , ఉపసర్పంచ్ బాపతి రమణారెడ్డి గార్ల ఆధ్వర్యంలో పెద్ద పసపుల గ్రామపంచాయతీ నందు 26 లక్షల రూపాయల వ్యయంతో నాలుగు సిమెంట్ రోడ్లు మరియు పది లక్షల రూపాయల వ్యయముతో ఎంపీపీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణము నకు భూమి పూజ నిర్వహించడం జరిగినది , అలాగే జే కొత్తపల్లి గ్రామపంచాయతీ నందు ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు గ్రామ సర్పంచ్ శ్రీ ఎం వెంకటకృష్ణారెడ్డి గారు , శివ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించడం జరిగినది . ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీల కార్యదర్శులు బషీర్ , విష్ణు , శ్రీనివాసులు రెడ్డి లు , ఉపాధి హామీ ఎపిఓ యం.వెంకటసుబ్బయ్య , ఈసి యన్ .శ్రీరాములు , టెక్నికల్ అసిస్టెంట్లు దస్తగిరి రెడ్డి, మల్లేశ్వర్ రెడ్డి, వెంకటసుబ్బయ్య మరియు కుమార్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లావణ్య , వెంగమ్మ , ఆదిలక్ష్మి , పెద్దపసుపుల మరియు జే కొత్తపల్లి సచివాలయాల సిబ్బంది , గ్రామ నాయకులు మరియు ప్రజలు పాల్గొనడం జరిగినది.