
భూ సమస్యల పరిష్కారం కొరకే గ్రామ రెవెన్యూ సదస్సులు
తహసిల్దార్ రమాదేవి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: గ్రామంలో గల ప్రజల భూ సమస్యల పరిష్కారం కొరకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని తుగ్గలి తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు. తుగ్గలి మండలంలోని గల బొందిమడుగుల గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మండల ఎమ్మార్వో రమాదేవి,గ్రామ సర్పంచ్ యన్.చౌడప్ప సర్పంచ్ సలహా దారులు ఎస్.ప్రతాప్ యాదవ్ ఆద్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా బొందిమడుగుల గ్రామ సర్పంచ్ సలహా దారులు ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర ప్రజల యొక్క భూసమస్యల పరిష్కారం కోసమే గ్రామాలలోని పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారన్నారు.ప్రజల యొక్క భూమి సమస్యలను పరిష్కరించుకునే అవకాశం గ్రామాలలో ఏర్పాటు చేయడం సంతోషమని,అదేవిధంగా గ్రామంలోని 238 సర్వే నంబర్ ఉన్న హిందూ స్మశాన వాటికలో కొలతలు వేయించి హిందూ స్మశాన వాటికను హిందువులకే శాశ్వతంగా చెందే విధంగా ఎమ్మార్వో మరియు మండల రెవెన్యూ అధికారులు చేయాలని గ్రామ సర్పంచ్ సలహాదారులు ప్రతాప్ యాదవ్ తెలియజేశారు.అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రజల కోసమే ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు.ఈ రెవెన్యూ సమస్యల ద్వారా ప్రజల భూ సమస్యలు పరిష్కారమవుతాయని వారు ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి,ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరయ్య,డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు,ప్యాపీలి రిజిస్ట్రార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ రామచంద్ర ప్రసాద్,మండల సర్వేయర్ సుధాకర్,వీఆర్వో లు వెంకటరాముడు, రహిమాన్,గోపాల కృష్ణ,గ్రామ ప్రజలు మునేశ్వర్ గౌడ్,నాగరాజు, సుబ్బారాయుడు,నాగేష్,చిన్నహుసేన్, వీరేంద్ర,ధనుంజయ,వెంకటేష్,నరేష్, బొందిమడుగుల,నల్లగుండ్ల గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.