
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అపాలి – కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ
కడప సర్కిల్, న్యూస్ వెలుగు; 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటు అయిన విశాఖ ఉక్కు ను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం చూస్తున్నదని,విభజన హామీలలో ప్రధానమైన కడప ఉక్కు ను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని SFI, DYFI విద్యార్థి,యువజన సంఘాల నాయకులు మండిపడ్డారు. విశాఖ ఉక్కు

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎద్దు.రాహుల్, వీరపోగు.రవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పైన కడప ఉక్కు పైన తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది అన్నారు.నాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేడు నష్టాలు వస్తున్నయన్న సాకుతో కార్పొరేటు శక్తులకు అమ్మే ప్రయత్నం వంటి కుటిల ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అన్నారు. నాడు ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు ప్రాణాలర్పించైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే విభజన హామీలను చట్టబద్ధంగా రాసుకున్న కడప ఉక్కుని సైతం కేంద్రం పక్షపాత ధోరణితో చూస్తూ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో కరువుతో ఒకవైపు అల్లాడుతుంటే వలసలతో అల్లడిపోతుంటే పాలకులకు కనపడటం లేదన్నారు. వలసలకు నివారణకు కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గం అన్నారు. ఇక్కడ చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు దేశాలకు వలసలు పోతున్నారు అన్నారు. అదే ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే చదువుకున్న యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు. గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో బిజెపి ప్రభుత్వం కడప ఉక్కు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందన్నారు. కనీసం ఈ ప్రాంత ఎంపీలు సైతం కడప ఉక్కు కోసం పోరాటం చేయకపోవడం దారుణమన్నారు. కడప ఉక్కు ముగ్గురు ముఖ్యమంత్రి మారితే మూడు శిలాఫలకాలు వేసి వెళ్లారు తప్ప ఏర్పాటుకు ఎవరు ప్రయత్నం చేయలేదన్నారు. పునాదిరాళ్లు సమాధి రాళ్ల లాగా విక్కిరిస్తున్నాయి తప్ప ఉక్కు పరిశ్రమ పనులు ముందుకు సాగడం లేదన్నారు. గత వైసిపి ప్రభుత్వం కడప ఉక్కును నిర్లక్ష్యం చేయడంతో రాయలసీమ ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్పారు గడిచిన సార్వత్రిక ఎన్నికల నిదర్శనం ఉన్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైన కడప ఉక్కు పైన కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏర్పాటు చేయడంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి తప్పదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని లేకుంటే రాబోవు రోజులలో విద్యార్థులు యువకులతో పెద్ద ఎత్తున పోరాటాలకు నాంది పలుకుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు నిర్మల్, నగర కన్వీనర్ విజయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు అభినయ్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra