న్యూస్ వెలుగు అమరావతి :

రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల్లో ఎమ్మెల్యేతో బాటు జిల్లా నోడల్ ఆఫీసర్, అకడెమిషియన్, యువ ప్రొఫెషనల్, విజన్ స్టాఫ్ (GSWS) 5గురు… ఇలా 9 మందితో ఒక బృందం పనిచేస్తుందని అని సీఎం
అన్నారు. దరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ ఇలా 10 ప్రధాన సూత్రాలతో విజన్ ప్లాన్ ఉంటుందని ఆయన చెప్పారు.
Thanks for your feedback!