
వలంటీర్ల మహాధర్నాకు హాజరు కావాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానని గౌరవ వేతనం 10,000 లకు పెంచుతానని ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు కాలయాపన చేస్తూ వాలంటరీలను మోసం చేస్తున్నారు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్నూలు జిల్లా పర్యటన లో భాగంగా కర్నూలు నగరం లో తేదీ 02/12/2024 నాడు ఉదయం 9:30 గంటలకు గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ హుమాయూన్ భాష కర్నూలు జిల్లాకు వస్తున్నారు హుమాయూన్ భాష ఆదేశానుసారంగా కర్నూలు జిల్లా లో ఉన్నటువంటి వాలంటీర్ లు అందరూ రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ కి హాజరు కావాలని పిలుపునిచ్చారు కావున వాలంటీర్స్ అందరూ వేల సంఖ్యలో ర్యాలీలో పాల్గొని మన సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలని కర్నూలు జిల్లా అధ్యక్షుడు షేక్ నూర్ అహ్మద్ కోరారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar