శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాల గోడపత్రిక విడుదల

శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాల గోడపత్రిక విడుదల

హొళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో కొండ గుహలో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర ఉత్సవాల గోడపత్రికను మంగళవారం ఆలయ ధర్మకర్త రాజపంపన్న గౌడ్,భారత్ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శివశంకర్ గౌడ్,సిద్ధార్థ్ గౌడ్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రాజపంపన్న గౌడ్ మాట్లాడుతూ వచ్చే నెల 02వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా 02న స్వామి,అమ్మవార్ల కంకణధారణ కార్యక్రమం,05న నంది ఉత్సవం,06న గజోత్సవం,07న మహా రథోత్సవం,08న లంక దహనం,09న వసంతోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలియజేశారు.కావున భక్తులు స్వామివారి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,రైస్ మిల్ మురళిధర్,అర్చకులు సిద్దయ్య స్వామి,రేణుక రాధ్య స్వామి,అమరేశప్ప, రైస్ మిల్ మురళి ఊలూరు కాడ సిద్ధప్ప సిద్ధన్న గౌడ,కోట్రేష్,రాజా,సిద్దప్ప, బసవ రాజా,శివప్ప, సాక్షి నాగప్పరవి కాంత్,వీరభద్ర,రవి, ఏరెప్ప,ఫణి,జగదీష్,బసవరాజ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!