వక్ఫ్, దేవాదాయ భూములను ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాలి

వక్ఫ్, దేవాదాయ భూములను ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాలి

 వక్ఫ్, దేవాదాయ భూములపై సర్వే చేసి ప్రస్తుత పరిస్థితిపై నివేదికలు ఇవ్వాలి

  జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు: వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా

డుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి తొలి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.. మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీములు ఏర్పాటు చేసి, అన్ని వక్ఫ్ , దేవాదాయ భూములను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు..వక్ఫ్, దేవాదాయ భూములను సర్వే నంబర్ వారీగా తనిఖీ చేసి, ఆక్రమణలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అని రికార్డ్ చేసి నివేదికను 10 రోజుల్లోపు తనకు సమర్పించాలని కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీఓ లను ఆదేశించారు… 15 రోజులకు ఒకసారి జిల్లా కమిటీ సమావేశం అయి, ఆక్రమణ లపై తీసుకున్న చర్యలపై సమీక్షిస్తామని కలెక్టర్ తెలిపారు..

పట్టణ ప్రాంతాల్లో వక్ఫ్, దేవాదాయ భూములపై దృష్టి సారించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు..పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ లను ఆదేశించారు..రాష్ర్ట ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చిందని కలెక్టర్ తెలిపారు..వక్ఫ్, దేవాదాయ భూములకి సంబంధించిన సర్వే నంబర్ ల పూర్తి వివరాలను మండల,డివిజన్ వారీగా తయారుచేసి సబ్ కలెక్టర్, ఆర్డీఓ లకు అందచేయాలని కలెక్టర్ డిఆర్వో ను ఆదేశించారు..

వక్ఫ్, దేవాదాయ భూముల ఆక్రమణలకు సంబంధించి పోలీస్ శాఖ వెంటనే స్పందించాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు..ఇందుకు సంబంధించి కేసులు ఏమైనా నమోదు అయ్యాయా? అని వెరిఫై చేయాలని కలెక్టర్ పోలీస్ అధికారులను ఆదేశించారు..వక్ఫ్, దేవాదాయ భూముల ఆక్రమణలకు సంబంధించి కలెక్టరేట్, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మైనార్టీ వెల్ఫేర్,పోలీస్, ఎండోమెంట్ శాఖల వద్ద ఉన్న గ్రీవెన్స్ లు అన్నీ ఒక చోటకు చేర్చి వాటి మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు..వక్ఫ్, దేవాదాయ భూముల సర్వే కోసం ఒక యాప్ ను రూపొందించాలని కలెక్టర్ డి ఆర్వో ను ఆదేశించారు..సర్వే నంబర్లు, తనిఖీ వివరాలు, ఆక్రమణల వివరాలు, ప్రస్తుత పరిస్థితి, ఫొటోగ్రాఫ్ ల అప్లోడ్ వంటి వివరాలతో యాప్ ను రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు..భూములను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో నియమ నిబంధనలు పాటించకుండా పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను హెచ్చరించారు..భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలోనూ నియమ నిబంధనలను పాటించాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ లను ఆదేశించారు..కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్, ఆన్లైన్ ద్వారా ఆదోని సబ్ కలెక్టర్,ఆర్డీవోలు,మునిసిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!