వార్డెన్ ను తక్షణమే విధులు నుండి తొలగించాలి

వార్డెన్ ను తక్షణమే విధులు నుండి తొలగించాలి

ఆయన అవినీతి అక్రమాలపై తక్షణమే విజిలెన్స్ దాడులు జరపాలి…

రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఓ డిమాండ్…

కడప, న్యూస్ వెలుగు;  స్థానిక కడప జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ ముద్దనూరు మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహం వార్డెన్ విధులకు గైర్హాజరవుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయనకు నచ్చిన విధంగా మెనూ పెడుతూ మెనూ బిల్లులను అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు, అదేవిధంగా విద్యార్థులు 80 మంది ఉంటే డైలీ 20 మంది విద్యార్థులు ఉండడం చాలా దుర్మార్గం అయినా విషయం అని మిగతా విద్యార్థులు ఎక్కడికి పోయినారు సార్ అంటే వచ్చుంటారు పోతుంటారు అని నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం ఆయన డ్యూటీ కి వ్యతిరేకమే నని వారు విమర్శించారు విద్యార్థులు 20 మంది ఉన్నా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి మాన్యువల్ రిజిస్టర్ రాసుకుంటూ బిల్లులు పెట్టుకుంటూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత మేడం వారికి వత్తాసు పలుకుతూ వారి పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా లక్షల రూపాయలు బిల్లులు ఫార్వర్డ్ చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని వీరికి సపోర్ట్ చేస్తున్న డిడి సరస్వతి కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తక్షణమే విలువైన జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని విజిలెన్స్ విజిలెన్స్ దాడులు జరపాలని ఇటువంటి అవినీతి అధికారులను విధుల నుండి తొలగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేనిపక్షంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాల శ్రీకారం ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు వంశీ తదితరులు పాల్గొన్నారు……

Author

Was this helpful?

Thanks for your feedback!