ప్రజల దాహార్తి తీర్చే వాటర్ ప్లాంట్ ను శుద్ధి చేయాలి: సిపిఎం
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంలో పాత బస్టాండ్ లో ఉన్న మున్సిపల్ మస్టర్ వద్ద ఉన్న ఫిల్టర్ వాటర్ శుద్ధి చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి జి ఏసుదాసు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 03.06.2017 తేదీన ఎస్ ఎఫ్ సి నిధులతో అప్పటి మున్సిపల్ అధికారులు ప్రజల దాహార్తి తీర్చడానికి పాత బస్టాండ్ లో ఫిల్టర్ వాటర్ సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ గతంలో ఫిల్టర్ వాటర్ శుద్ధి చేయడానికి మున్సిపల్ కార్యాలయం నుంచి ఒక వ్యక్తి నియమించి వాటర్ ప్లాంట్ ను శుద్ధి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ను శుద్ధి చేయక 2,3 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ఈ నీటిని చాలామంది ప్రజలు బస్సు ఎక్కేవారు వ్యాపారస్తులు ఆటో వర్కర్స్ తోపుడు బండ్లు నిత్యం చాలామంది వాటర్ బాటిల్ , గ్లాస్ లో ఈ ఫిల్టర్ వాటర్ సదుపాయాన్ని ఉపయోగిస్తూ వస్తున్నారు. అంతేకాక వేసవికాలంలో ప్రజలకు ప్రయాణికులకు అందరికీ ఇక్కడ ఫిల్టర్ వాటర్ ను చల్లని నీటితో దాహం తీర్చుకునేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా దుర్వాసన రావడం అలాగే ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను శుద్ధి చేయకపోవడం ఆ నీటిని తాగలేక ప్రజలు వ్యాపారస్తులు తోపుడుబండ్లు కూలీలు ఆ నీటిని తాగలేక పోతున్నారు. అలాగే పక్కనే ఉన్న సులబ్ కాంప్లెక్స్ వారు అక్కడ నీటికి వసతి లేకపోతే ఈ నీటిని వారు వాడుకొవడం జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే చొరవ చూపి ఆ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ను శుద్ధిచేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై అబ్రహం , ప్రభాకర్ నాగరాజు, వెంకటేష్ నాయక్, పాల్గొన్నారు.