కరెంట్ బిల్లు ఆదాకు మార్గాలు

కరెంట్ బిల్లు ఆదాకు మార్గాలు

న్యూస్ వెలుగు, కర్నూలు; 1. ఇళ్లలో మరియు దుకాణాలలో సాధారణ ఫిలమెంట్ (గుండ్రని ఎర్రటి బల్బ్) వాడరాదు వాటి స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడవలెను. ఆరువాట్ల ఎల్ఈడి బల్బులతో 60 వాట్ల సాధారణ ఫిలమెంట్ బల్బు వెల్తురు వచ్చును.
2. టీవీ చూశాక రిమోట్ తో కాకుండా స్విచ్ ఆఫ్ చేయాలి.
3. ఐ ఎస్ ఐ మరియు స్టార్ రేటెడ్ గృహప్రకారణాలు వాడవలెను.
4. కరెంట్ స్టవ్ మరియు వాటర్ గీజర్ బదులు గ్యాస్ హీటర్స్ మరియు కుక్కర్లు గ్యాస్ గీజర్లు వాడవలెను.
5. పగటిపూట ఇంటిలో సహజమైన వెలుతురుని కిటికీల ద్వారా పొంది లైట్లను ఆన్ చేయకుండా ఉండటం.
6. ఏసీలను 25° c ల వద్ద వాడడం.
7. ముఖ్యంగా రైతన్నలు ఐఎస్ఐ మార్కు గల మోటార్లను వాడటం మరియు వాటికి సరిహద్దు కెపాసిటర్లను బిగించుకోవడం అలాగే డెలివరీకి ఇనుప మరియు జిఐ పైపుల స్థానంలో హెచ్ డి పి ఈ పైపులను వాడడం పైప్ లైన్ లలో వంపులు, బెండ్లు, జాయింట్లు లేకుండా చూసుకోవడం.
8. అలాగే గౌరవ భారత ప్రభుత్వము సాంప్రదాయ శక్తి వనరుల వినియోగ పొదుపునకై సాంప్రదాయేతర శక్తి వనరులైన సౌర విద్యుత్ వినియోగమునకై ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన** పథకం ద్వారా గృహ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వ రాయితీ అందిస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులందరూ పొదుపు మంత్రం పాటిస్తూ తమ విద్యుత్ వాడకమును మరియు బిల్లులను అదుపు చేసుకోగలరని కోరుచున్నాము
ఎం ఉమాపతి, పర్యవేక్షక ఇంజనీర్: కర్నూలు జిల్లా.ఏపీఎస్పీడీసీఎల్.

Author

Was this helpful?

Thanks for your feedback!