ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం : వీరభద్ర గౌడ్
ఆలూరు (హోళగుంద): ఆలూరు నియోజకవర్గం వ్యాప్తంగా గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగల నిర్వహించడం జరిగిందని ఆలూరు టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ తెలిపారు. సచివాలయం సిబ్బంది లబ్దిదారులు ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం ఐదు గంటలనుండే పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలూరు తాలూకా టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జీ వీరభద్ర గౌడ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్-6 పథకాలలో భాగంగా పెన్షన్ దారులకు నెల నెల నాలుగువేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు తూచా తప్పకుండా హామీ అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ది పనులు ప్రారంభిస్తామని ఆయన ఆయన పేర్కొన్నారు. నిరయోజకవర్గంలో .ఈ కార్యక్రమంలో ఎస్ఐ పెద్దయ్య నాయుడు,ఎంపీడీఓ ఆజాద్,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,మాజీ సర్పంచ్ పంపన్న గౌడ,నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిదానంద,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి,బిజెపి మండల అధ్యక్షులు నరసింహ ప్రసాద్,మైనార్టీ సంఘం నాయకులు అదాం,కూటమి నాయకులు జక్కన్న ఆచారి,తిప్పన్న,ఎర్రి స్వామి,జంబప్ప,శేఖర్,దిడ్డి వెంకటేష్,సాయిబెస్,లక్ష్మణ,మంజు సచివాలయం సిబ్బంది,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.