70 ఏళ్ల వయసులో కార్యాలయాల చుట్టు తిరుగుతున్నాం

70 ఏళ్ల వయసులో కార్యాలయాల చుట్టు తిరుగుతున్నాం

కర్నూలు న్యూస్ వెలుగు: తన స్వార్థం కోసం వేసిన రోడ్డుతో 50 ఎకరాలకు పైగా సాగులో ఉన్న రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారని, గత ఐదు నెలలకు పైగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ 70 ఏళ్ల వయసులో మేము తిరగాల్సి వచ్చిందని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన రైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు నిలిచి తాము వేసిన పంట సైతం చేతికి రాలేదని రైతు లుమ హీపతిరావు, పృద్విపతిరావు అన్నారు. సర్వే నెంబరు 387 /1, 387/ 2 లను ఆనుకుని 50 ఎకరాలకు పైగా సాగవుతుందని అందులోని రైతులు వర్షపు నీరు చేరి ఇబ్బందులు పడ్డారన్నారు. కురువ శ్రీనివాసులు వేసిన రోడ్డుతో పొలాల్లో వర్షపు నీరు ఆగి పంటను సైతం దెబ్బతినిందని ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు అధికారులను వివరణ కోరారని, వివరణ లోను అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టినట్లు వారు ఆరోపించారు. వర్షపు నీరు ఆగకుండా కురువ శ్రీనివాసులు పొలం గుండా నీరు పోయేలా కాలువలు ఏర్పాటు చేయాలని లేదా పైప్ లైన్లు వేయాలని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని చివరకు మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. గ్రామాలలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే నిరసన చేయనున్నట్లు వారు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!