జిల్లాలో 69 సెంటర్లలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలియజేశారు.గురువారం ఉదయం స్థానిక ఉస్మానియా కళాశాల లో

నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 1వ తేది శనివారం నుండి ప్రారంభమైన ఇంటర్ పరీక్షల కోసం 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో 45,325 (మొదటి సంవత్సరం 23,098, రెండవ సంవత్సరం 22,227) మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్, లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .. అదే విధంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు..కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు..
Thanks for your feedback!