
ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం పై 27న పత్తికొండలో ధర్నాలో పాల్గొందాం
తుగ్గలి, వెలుగు న్యూస్ ప్రతినిధి: గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాణ్యమైన విద్యుత్తు అందిస్తాం. విద్యుత్ ఛార్జీలు పెంచం అని ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన తర్వాత నాణ్యమైన విద్యుత్ ఇవ్వకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచడం తో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత శ్రీ గౌరవనీయులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27వ తేదీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా చేయాలని పిలుపునివ్వడంతో మండలంలోని వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి, ఇతర ప్రజాప్రతినిధులు ఈనెల 27వ తేదీ ఉదయం 10.00 గంటలకు పత్తికొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ జరిగే ధర్నా కార్యక్రమంలో అందరూ హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.
జిట్టా నగేష్ యాదవ్ 
వైసీపీ మండల కన్వీనర్
తుగ్గలి మండలం


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu