
ఎన్నికల్లో మాట ఇచ్చాం పథకాలు అమలుచేస్తాం : సీఎం చంద్రబాబు
న్యూస్ వెలుగు శ్రీకాకుళం : ‘‘మత్స్యకారుల సేవలో’’ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రజలు ఎలాంటి సందేహం అక్కర్లేదని కూటమి ప్రభుత్వం పై ప్రతిపక్షాల విమర్శలు కేవలం వారి మనుగడకోసమేనని వారు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు జీరో పావర్టీ -పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!