
ఈ సేవా స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలి : యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి వెంకట బసవరావు
కర్నూలు న్యూస్ వెలుగు: జాతీయ సేవా పథకం స్ఫూర్తితో వాలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి వెంకట బసవరావు పిలుపుమేరకు చేపట్టిన స్పెషల్ క్యాంప్ ముగింపు కార్యక్రమం కర్నూల్ మండలం రుద్రవరంలో నిర్వహించారు. గ్రామంలో వారం రోజులుగా రాయలసీమ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ బీటెక్ విద్యార్థులు చేపట్టిన సామాజిక కార్యక్రమాలు విజవంతంగా మంగళవారం ముగిసాయి.ఈ ముగింపు కార్య క్రమంలో రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి వెంకట బసవరావు ముఖ్యఅతిథిగా పాల్గొని రాయలసీమ యూనివర్సిటీ యూనిట్ ఫోర్ ఎన్ ఎస్ ఎస్ బి టెక్ విద్యార్థులకు స్పెషల్ క్యాంపు సర్టిఫికెట్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ యువత బాధ్యత యుతంగా ఉన్నప్పుడే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఆయన యువతకు పిలుపునిచ్చారు . వారం రోజులపాటు గ్రామ ప్రజలతో మమేకమై వారి స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు సామాజిక రుగ్మతలపై వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన యూనిట్ ఫోర్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను ప్రత్యేకంగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య వి వెంకట బసవరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుందర ఆనంద్ , విజయ్ కుమార్ నాయుడు,కోఆర్డినేటర్ :నాగరాజు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ , ప్ప్రొఫిసర్ నాగా చంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

