రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం…
హిందూ ఉపాధ్యాయ సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కురువ చంద్రశేఖర్
న్యూస్ వెలుగు కర్నూలు: కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందడానికి తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని అనుమతించబోమన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని హిందూ ఉపాధ్యాయ సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కురువ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పు ద్వారా ఎస్సి , ఎస్టీ రిజర్వేషన్లు హిందువులకు మాత్రమేనని స్పష్టంగా తెలిపారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు శుక్రవారం రోజున గంట అనుమతిస్తున్నారని అదే తరహాలో కార్తిక మార్గశిర మాసాల్లో హిందూ ఉద్యోగులకు గంట ప్రత్యేక అనుమతి కోసం ఐదేళ్లుగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా పాలకులు స్పందించాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!