
ఉద్యోగులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం : ఎంపీపీ
సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ ఆర్.రామాంజినమ్మ
తుగ్గలి న్యూస్ వెలుగు : మండలం పరిధిలోని శభాష్ పురం గ్రామ సచివాలయం నందు విధులకు హాజరుకాకుండా డుమ్మా కొట్టిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఎంపీపీ ఆర్ రామాంజనమ్మ పేర్కొన్నారు.శనివారం మధ్యాహ్నం శభాష్ పురం సచివాలయాన్ని ఎంపీపీ ఆర్.రామాంజనేయమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.తనిఖీ సమయంలో పలువురు సచివాలయ ఉద్యోగులు వీఆర్వో లక్ష్మి,డిజిటల్ అసిస్టెంట్ శివ నాయక్,వెల్ఫేర్ అసిస్టెంట్ రాజ్ పవన్ కుమార్,మహిళా పోలీస్ వర్షిని లు ఎలాంటి సెలవు పెట్టకుండా విధులకు డుమ్మా కొట్టడంతో వారిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.ప్రజా సమస్యలు పరిష్కరించవలసిన అధికారులు విధులకు హాజరు కాకపోవడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై మండల స్థాయి అధికారులకు తెలియజేసినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, అందువల్ల ఈ విషయంపై స్వయంగా జిల్లా కలెక్టర్లను కలిసి వారిపై చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు చేస్తానని ఎంపీపీ ఆర్.రామాంజనమ్మ తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున గ్రామసభ జరపకుండా సచివాలయనాకి తాళాలు కూడా వేసినట్లు ఎంపీపీ ఆర్. రామాంజనమ్మ తెలిపారు.ఈ విషయాలన్నీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీపీ రామాంజనమ్మ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వీరేష్,సచివాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.