ఆయుష్మాన్ పై చర్యలు తీసుకునే వరకు పోరాడుతాం

ఆయుష్మాన్ పై చర్యలు తీసుకునే వరకు పోరాడుతాం

అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అర్ధ నగ్న నిరసన ధర్నా-ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ

కర్నూలు, న్యూస్ వెలుగు; ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల వైఖరిని నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షతన అర్థనగ్న ప్రదర్శనతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ మాట్లాడుతూ అక్రమంగా వెంకటరమణ కాలనీలో పర్మిషన్ తీసుకొని గణేష్ నగర్ లోని సోమిశెట్టి కాలనీలో నిర్వహించడం, ప్రభుత్వం నిర్ణయించిన వాటికంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ అకౌంట్ లో వేస్తానని చెప్పిన దానికి విరుద్ధంగా విద్యార్థులే కట్టాలని అహంకారంగా అడ్డగోలుగా విద్యార్థులను వేధించి వసూలు చేస్తున్నారని, తాజుద్దీన్ అనే విద్యార్థి 70 వేల రూపాయల ఫీజు కట్టినప్పటికీ రెండవ సంవత్సరం పరీక్షలు రాయనీయకుండా బయటికి గెంటి వేశాడని ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే దశలవారీగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని అవసరమైతే అక్రమంగా నిర్వహిస్తున్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ భాష ఉపాధ్యక్షులు వీరేష్, మహేష్ ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అబుబాకర్ నాయకులు పృద్వి యోగి ఎస్ఎఫ్ఐ టెక్నికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ జిల్లా కన్వీనర్ అమర్, కో కన్వీనర్ మనోహర్, శంకర్ రజాక్ తరుణ్ మహబూబ్ సమీర్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!