18న సచివాలయం దగ్గర ఆందోళన చేస్తాం ; సిపిఐ 

18న సచివాలయం దగ్గర ఆందోళన చేస్తాం ; సిపిఐ 

డోన్, న్యూస్ వెలుగు; డోన్ పట్టణంలోని శ్రీరామనగర్ శాఖ సమావేశం నిర్వహించారు శాఖ కార్యదర్శి బాల మద్దయ్య అధ్యక్షతన జరిగిందిఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ N రంగ నాయుడు  జిల్లా కార్యవర్గ సభ్యులు p పి సుంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కామ్రేడ్. Nరంగ నాయుడు  మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు గ్రామంలో ఒకటిన్నరసెంట్లు పట్టణాలలో ఒక సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది అయా ప్రాంతాల్లో కేటాయించడం జరిగింది అందులో చాలామంది పేదలకు ఇప్పటివరకు ఇండ్ల స్థలాలు చూపలేదు ప్రభుత్వం ఇచ్చే ఒక సెంటు స్థలం పేదల నివాసానికి ఏ మాత్రం సరిపోదని ఆనాడే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఐ పార్టీగా చెప్పినప్పటికీ ఖాతర్ చేయకుండా నాటి ప్రభుత్వం ముందుగా ముందుకెళ్ళింది కాకి లెక్కలతో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ పేదల స్థలాల పట్ల మొగ్గ చూపలేదు పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సాయం కూడా కేవలం 1,80,000 మాత్రమే ప్రకటించారు ఆర్థిక సాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేదని పేదలు ఎవరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదు వైయస్సార్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు పట్టాలు నిరుపయోగంగా మారాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఎన్నికల ముందు పేదలకు మూడు సెంట్లు పట్టణాలకురెండు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత కూడా ముఖ్యమంత్రి  అదేవిధంగా హామీ ఇస్తూ ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది ఇంటి స్థలాల కేటాయింపు పట్ల చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సానుకూలమే సిమెంటు ఇసుక ఇటుక ఇనుప కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా రూ 5 లక్షల పెంచి గృహ నిర్మాణ మంజూరు చేయాలని వారన్నారుపేదల ఇళ్ల నిర్మాణం సిమెంటు ఇసుక ఇనుము ఇటుక కంకర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో పట్టణాల్లో నివాస యోగ్యంగాగృహ నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించాలి గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లను మార్పు చేసి పేదలకు గ్రామంలో పట్టణాల్లో పేదలకు తక్షణమే స్థలాలు ఇండ్లు చేపట్టి మంజూరు చేయాలని శ్రీరామ నగర్ కిరోడ్లు విద్యుత్తు త్రాగునీరు డ్రైనేజీ పారుదల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం వద్ద పేదలతో వ్యక్తిగత అర్జీలు అందించి ఆందోళన కార్యక్రమం చేపడతామని  హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ మండల కార్యదర్శి మె టా రాముడు బి నారాయణ పట్టణ సహాయ కార్యదర్శి nk రామ్మోహన్ aisf జిల్లాఅధ్యక్షులు సూర్య ప్రతాపుaiyf జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్ మహిళా సమైక్య జిల్లాఆర్గనైజింగ్ కార్యదర్శి షమీం బేగం aituc నియోజకవర్గకార్యదర్శి అబ్బాసు మహిళా సమైక్య మండల కార్యదర్శి లక్ష్మీదేవి aisf మండల కార్యదర్శి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!