ట్రాన్స్ జెండర్ కు సమాన అవకాశాలు కల్పిస్తాం

ట్రాన్స్ జెండర్ కు సమాన అవకాశాలు కల్పిస్తాం

ట్రాన్స్ జెండర్ సమస్యలను పరిష్కరిస్తాం

ట్రాన్స్ జెండర్స్ కు కలెక్టర్ భరోసా

నంద్యాల, న్యూస్ వెలుగు; సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాలులో ట్రాన్స్ జెండర్ ల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 240 మంది పెన్షన్ పొందుతున్నట్లు, వైద్య శాఖ నివేదికల్లో 690 మంది ఉన్నట్లు, ఎన్జీవో సంస్థలు వెయ్యి మంది ఉన్నట్లు రకరకాల గణాంకాలు చెప్తున్నారని… నిజమైన ట్రాన్స్జెండర్ల జాబితాను సమర్పించాలని సంబంధిత ఎన్జీవో సంస్థలను కలెక్టర్ సూచించారు. ట్రాన్స్ జెండర్లు ఏ ఏరియాలో ఉన్నారు, ఎంతమందికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డులు ఉన్నాయి, ప్రస్తుతం వారు చేస్తున్న పనులు, వారితోపాటు జీవిస్తున్న వ్యక్తులు తదితర వివరాలను వారం రోజుల్లో ఇవ్వాలని సంబంధిత అధికారులు, ఎన్జీవో సంస్థలను కలెక్టర్ ఆదేశించారు. భారత ప్రభుత్వం జారీచేసిన ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని 2019లో జారీ చేసిన చట్టం మేరకు భిక్షాటన, అసభ్య ప్రవర్తన, వ్యభిచారం మూడు అంశాలను పరిగణలోనికి తీసుకొని ప్రభుత్వం తరఫున లబ్ధి చేకూర్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.

సమాజంలో ట్రాన్స్ జెండర్లను వేరు చేసి మనోభావాలు దెబ్బతీయడం ఉద్దేశం కాదని మీ అభ్యున్నతికి వికలాంగుల శాఖ పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు. గతంలో తాను పనిచేసిన జిల్లాలలో ట్రాన్స్ జెండర్ ల సమస్యలు తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులతో వాళ్లు నివసిస్తున్న కాలనీలకు వెళ్లి లబ్ధి చేకూర్చామన్నారు. ఇదే తరహాలో జీఓలోని నిబంధనల మేరకు ట్రాన్స్ జెండర్లకు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తామన్నారు. జిల్లాలో 42 మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారని ట్రాన్స్ జెండర్లు కూడా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. పెన్షన్ పొందుతున్న 240 మంది ట్రాన్స్ ట్రాంజెండర్లను 24 స్వయం సంఘాలుగా 15 రోజులలో ఏర్పాటు చేసి విధివిధానాలపై అవగాహన కల్పించాలని డిఆర్డిఏ పిడి, మెప్మా పీడీలను కలెక్టర్ ఆదేశించారు. ఆసక్తి గల వృత్తులపై నైపుణ్యాన్ని ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాలు కూడా కల్పిస్తామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో నూతనంగా మెడికల్ కళాశాల వచ్చిందని, ప్రభుత్వ సర్వజన వైద్యశాల అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో మెడికల్ బోర్డు ఏర్పాటుకు మూడు రోజుల్లో ఫైల్ ను సర్కులేట్ చేయాలని డిఎంఅండ్హెచ్ఓ, జిజిహెచ్ సూపరింటెండెంట్ కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రత్యేక ఓపి బ్లాక్ ను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాలో హౌసింగ్ స్కీం కింద కేటాయించిన 70 మంది ఐడి వివరాలను తీసుకొని విచారిస్తామన్నారు. అలాగే నూతన పాలసీ ప్రకారం జిల్లాలోని ట్రాన్స్ జెండర్ ల అందరికీ గృహాలు కేటాయిస్తామన్నారు. ఒక్కో ఒక్కో ఇంటి నిర్మాణానికి మూడున్నర నుండి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ట్రాన్స్ జెండర్ లందరూ ఐక్యమత్యంగా ఉండి మీ హక్కులను మీరు సాధించుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సమావేశం నిర్వహించి ట్రాన్స్ జెండర్ల సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి రైస్ ఫాతిమా, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, అడిషనల్ డిఎంహెచ్వో శారదాబాయి, సివిల్ సప్లైస్ అధికారి వెంకట్రాముడు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబిహా పర్వీన్, ఎంప్లాయిమెంట్ అధికారి సోమ శివారెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటసుబ్బయ్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!