విద్యావ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దుతాం

విద్యావ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దుతాం

మెగా పిటిఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుంది

న్యూస్ వెలుగు, కర్నూలు; విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు అం ద‌రూ క‌లిసిన‌ గొప్ప వేదిక మెగా పేరెంట్స్-టీచ‌ర్స్ మీటింగ్ అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ న‌గ‌రంలోని ఏ.క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియ‌ల్ హైస్కూల్‌లో నిర్వ‌హించిన మెగా పేరెంట్స్-టీచ‌ర్స్ మీటింగ్‌లో మంత్రి టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అంద‌రూ క‌లిసి స‌మావేశం అవ్వ‌డం ద్వారా ఎంతో ఉప‌యోగం ఉంటుంద‌న్నారు. స‌మావేశం ద్వారా పాఠ‌శాల‌ల స‌మ‌స్య‌లు తెలుస్తాయని, పిల్ల‌లు ఎలా చ‌దువుతున్నారో త‌ల్లిదండ్రుల‌కు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆలోచ‌న మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. విద్యార్థులు చ‌దువుతో పాటు అన్ని రంగ‌ల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌న్నారు. త‌ల్లిదండ్రులు సైతం విద్యార్థుల‌కు ఎప్పటిక‌ప్పుడు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న సూచించారు. తల్లిదండ్రులు వారి పిల్లల గురించి ఏదైనా సమస్య ఉంటే ఉపాధ్యాయుల తీసుకురావాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి, విద్యార్థుల యొక్క ఆరోగ్యం గురించి కూడా పాఠశాలలోని ఉపాధ్యాయులతో చ‌ర్చించాల‌న్నారు. పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేసుకొని స్కూల్స్‌లో విద్యార్థుల చదువుతోపాటు మౌలిక స‌దుపాయాలు, స‌మ‌స్య‌ల గురించి మాట్లాడి ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. ఇక‌ విద్యార్థుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు నైతిక విలువల సలహాదారుగా ప్ర‌భుత్వం నియ‌మించింద‌న్నారు. జీవితంలో చ‌దువుతో పాటు మంచి విలువ‌లతో ఎలా ఎద‌గాలో తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!