పెద్ద దేవలాపురంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

పెద్ద దేవలాపురంలో రైతన్న మీకోసం వారోత్సవాలు

నంద్యాల జిల్లా న్యూస్ వెలుగు 16 : బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ వ్యవసాయ అధికారి ఆఫ్రత్ ఆధ్వర్యంలో సోమవారం రైతన్న -మీకోసం వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం నిర్దేశించిన ఐదు సూత్రాలు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి మరియు ప్రభుత్వ మద్దతు గురించి రైతులకు వివరించారు. ప్రతి రైతు ఫార్మర్ యాప్ ఏపీ ఎయిమ్స్ 2.0 డౌన్లోడ్ చేసు కోవాలని , వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాలను రైతులకు తెలియజేశారు. అనంతరం రైతులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు గ్రామ టిడిపి నాయకుడు మలిరెడ్డి భాస్కర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS