పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి

 న్యూస్ వెలుగు : విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక బహిరంగ సభలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం  ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటివరకు అనేక సక్షేమ పతకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ముఖ్యంత్రి తెలిపారు .16 నెలలుగా నిరాటంకంగా పెన్షన్లు ఇస్తున్నాం. భర్త చనిపోతే భార్యకు మరుసటి నెలలోనే వితంతు పింఛన్ ఇస్తున్నాం. ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలో, రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చాం. గత ప్రభుత్వం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే కట్ చేసేదన్నారు. ప్రభుత్వానికి లాభం కాదు చూడాల్సింది. పేదల సంక్షేమమన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇచ్చాం. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం, పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. రాష్ట్రంలో తల్లికి వందనం పథకాన్ని 63,77,000 మంది పిల్లలకు ఇస్తున్నాం. దీని కోసం రూ.10,090 కోట్లు ఖర్చు చేస్తున్నాం. చదువుకునే పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఇది. అర్హులైన వారు ఎవరికైనా తల్లికి వందనం గానీ, పెన్షన్ గానీ రాకపోతే దాని కూడా సరిదిద్దే బాధ్యత నాదేనన్నారు.

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS