
ఘనంగా ప్రాథమిక సహకార సంఘం వారోత్సవాలు
తుగ్గలి (న్యూస్ వెలుగ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 72వ సహకార సంఘం వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.నవంబర్ 14 నుండి 20 తేది వరకు అన్ని సహకార సంఘాల యందు వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.శుక్రవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల మారెళ్ళ అశోక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సొసైటీ అధ్యక్షులు ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్లు రాంపల్లి శ్రీనివాసులు,బొందిమడుగుల మోహన్ లు రైతుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి సహకార సంఘ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ వడ్డీలకే రైతులకు రుణాలు అందజేస్తున్నామని వారు తెలియజేశారు.సన్నకారు రైతులకు, పండ్ల తోట సాగు చేసే రైతులకు తక్కువ వడ్డీలకే రుణాలను అందజేస్తున్నామని వారు తెలియజేశారు.హార్టికల్చర్ మరియు ల్యాండ్ డెవలప్మెంట్ రైతులకు సుమారు నాలుగు కోట్ల వరకు రుణాలను మంజూరు చేసినట్లు వారు తెలియజేశారు.క్రాప్ లోన్ లను సక్రమంగా చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ సకాలంలో అందుతుందని వారు రైతులకు తెలియజేశారు. రైతులందరూ సక్రమంగా వడ్డీలను చెల్లించడం ద్వారా సహకార సంఘాలు మరింత అభివృద్ధి చెందుతాయని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,సొసైటీ సీఈవో మనోహర్ నాయుడు,మాజీ సర్పంచ్ మసాలా శీను,మారెళ్ళ వెంకటరాముడు,మాజీ విద్యా కమిటీ చైర్మన్ డి.రాముడు తదితర టిడిపి నాయకులు,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

