నేటి బాలలే రేపటి పౌరులు

నేటి బాలలే రేపటి పౌరులు

తుగ్గలి (న్యూస్ వెలుగ): మండలంలో పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల యందు బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.శుక్రవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలో గల నోవి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆగస్టీన్ హాజరై విద్యార్థులకు పలు విలువైన సందేశాలను తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రులకు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలియజేశారు.అనంతరం నోవి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు తిప్పయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఆగస్టీన్ కు శాలువాను కప్పి ఘనంగా సన్మానించారు.అనంతరం విద్యార్థులు పలువురు సాంస్కృతిక,నృత్య,ఆట పాటలతో అలరించారు.అదేవిధంగా తుగ్గలిలోని గల సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బాల బాలికల ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలను నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు పాఠశాల యందు ఆటల పోటీలను నిర్వహించారు.ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ దండు భాస్కర్ యాదవ్ బహుమతులను ప్రధానం చేశారు.అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పలు విషయాలను ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!