
డిక్లరేషన్‌పై సంతకం పెడితే ఏమైంది.. జగన్‌ను నిలదీసిన టీజీ వెంకటేశ్
కర్నూలు, న్యూస్ వెలుగు; తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తేటతెల్లమైందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ తెలిపారు. కల్తీ ఎంత పర్సంటేజ్ జరిగిందో తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తులో వాసత్వాలు బయటకు వస్తాయని అన్నారు. ఆధారాలు ఎవరూ మార్చలేరని అంతా బయటకు వస్తుందని స్పష్టం చేశారు.
నార్త్‌లో యానిమల్ ఫ్యాట్ కామన్ అయిపోయిందని టీజీ వెంకటేశ్ అన్నారు. అక్కడ పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుందని తెలిపారు. హిందువుల మనోభావాలతో జగన్ ఇంకా ఆడుకుంటున్నారని విమర్శించారు. తిరుమలలో అవకతవకలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్నాయని.. వాటిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు అని.. వైవీ సుబ్బారెడ్డి సతీమణి అన్యమతస్తురాలు అని తెలిపారు. వారిని టీటీడీ చైర్మన్లుగా ఎందుకు నియమించారని జగన్‌ను ప్రశ్నించారు.
తిరుమల లడ్డూలో కల్తీ జరగడంపై హిందూ సమాజం ఆగ్రహంతో ఉందని టీజీ వెంకటేశ్ తెలిపారు. డిక్లరేషన్‌పై జగన్ ఎందుకు సంతకం పెట్టడం లేదని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి తిరుమల సెట్టింగ్ వేసుకున్న జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెడితే ఏమైందని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి కేసులో ఆధారాలు ఎవరూ మార్చలేరని.. నేరస్తులకు కచ్చితంగా శిక్ష పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.