
బీసీలకు ఇచ్చిన మాట ఏమైంది చంద్రబాబు..!
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పిసిసి చైర్మన్
అమరావతి, న్యూస్ వెలుగు; ప్రధాని మోడీ ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు. “బీసీ ప్రధాని ఫాయిదా కుచ్ నహీ”. 2017లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మళ్ళీ అధికారంలో వచ్చి మాట మార్చారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం అన్నారు. బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదు. బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు. బీజేపీ అగ్రకుల పార్టీ. అదానీ,అంబానీలకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ. బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143కి పెంచారు. బీసీలు అందరు బాగుపడాలని కోరుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టీ బీసీ బిడ్డలను అగ్రస్థానంలో నిలబెట్టారు. స్కాలర్ షిప్లు ఇచ్చారు. అందుకే బీసీలు వైఎస్ఆర్ గారిని తమ నాయకుడుగా ఓన్ చేసుకున్నారు.