దళితులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా పెట్టడమేమిటి?

దళితులను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని బిజెపి అధ్యక్షుడిగా పెట్టడమేమిటి?

    కెవిపియస్ విమర్శ

కర్నూలు, న్యూస్ వెలుగు; కౌతాళం మండలం కామవరం గ్రామంలో 2022 జనవరి 27న దళితులపై పట్టపగలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ముద్దాయిగా ఉన్న రామకృష్ణను బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం బిజెపి పార్టీ యొక్క నైతికతకు నిదర్శనమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు విమర్శించారు.
బుధవారం కర్నూల్ నగరంలోని బుధవార్ పేటలో ఉన్న కెవిపిఎస్ జిల్లా కార్యాలయంలో కెవిపిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ జి కృష్ణ తో కలిసి ఆనంద్ బాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులపై జరిగిన కిరాతకమైన హత్య ఘటనలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తప్ప బిజెపికి వేరే నాయకులు జిల్లా అధ్యక్షులుగా పెట్టడానికి దొరకలేదా ఎద్దేవా చేశారు. హత్య ఘటనలే కాదు, అనేక అసాంఘిక కార్యక్రమాలు మట్కా లాంటి వాటితో కూడా సంబంధం ఉంది అని ప్రచారం జరుగుతున్న వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించారు అని అంటేనే, మతసామరస్యానికి, కుల మత సోదర భావానికి ప్రతీకగా ఉన్న కర్నూలు జిల్లాను ఏమి చేయాలనుకుంటున్నారని వారు ప్రశ్నించారు. ఇప్పటికే ఒకవైపు పార్లమెంటు సాక్షిగా దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అంటూ అంబేద్కర్ను అవమానించి, దేశంలో ఉన్న నిమ్న కులాలు అందరికీ హక్కులను ప్రసాదించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్న క్రమంలో కర్నూలు జిల్లాలో కూడా దళితులపై జరిగిన హత్యాకాండలో భాగం పంచుకున్న రామకృష్ణను జిల్లా అధ్యక్షుడిగా నియమించడం, బిజెపి యొక్క కుటిల నీతి అర్థమవుతోందన్నారు. వెంటనే రామకృష్ణను బిజెపి అధ్యక్షుడిగా తొలగించి మరో వ్యక్తిని బీసీ సామాజిక తరగతి నుండే జిల్లా అధ్యక్షులుగా నియమించాలన్నారు. ఇప్పటికైనా బిజెపి మాయలో ఉండే దళితులు, బడుగు బలహీన వర్గాలు గమనించి ప్రశ్నించాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!