18 రోజులు అయినా భారతి మృతదేహం లభించక పోవడంలో ఆంతర్యం ఏమిటి…!

18 రోజులు అయినా భారతి మృతదేహం లభించక పోవడంలో ఆంతర్యం ఏమిటి…!

భారతి మిస్సింగ్ కేసును చేధించడంలో పోలీసుల తీరుపై  మహిళా సంఘాలు ప్రజాసంఘాలు   ఆగ్రహం 

   కల్లూరు, న్యూస్ వెలుగు;  కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం,కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో 2025 వ సంవత్సరం జనవరి 1 వ తేదీన మధ్యాహ్నం 12.00 గంటల సమయం నుండి వివాహిత మహిళ భారతి కనపడటం లేదు.కొద్దిమంది గ్రామస్థులు,అత్తింటి వారు మరియు ఉల్లిందకొండ పోలీసుల కథనం ఏమిటంటే భారతి కొత్త సంవత్సరం రోజున ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో తన తోడికోడలుతో కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా గడిపినదని ఆ తర్వాత మామకు చెప్పి పొలానికి వెళ్ళిందని, భారతి వెళ్ళిన కొద్ది సేపటికి భర్త రవికుమార్ కూడా వెళ్ళారని, పొలములో ఒక చెట్టు కింద భారతి తన భర్త కజిన్ బ్రదర్ అయిన రాఘవేంద్రతో వున్న దృశ్యాన్ని చూసి భార్య భారతితో నాయనకు చెబుతాను అంటూ భర్త ఇంటికి వెళ్ళి పోయాడంటా. భారతి హంద్రీనీవా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నది అని అటుగా బైక్ పై వస్తున్న గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చూసి, సచివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ వున్న వ్యక్తులకు చెప్పి వారిని తీసుకెళ్ళి కాలువలో చూడగా భారతి నీటిలో మునిగి చేతులు మాత్రం కనిపించాయని ఆ తర్వాత పూర్తిగా మునిగిపోయిందని చెప్పారు. కాలువలో దూకిన భారతి శవం కానీ శవానికి సంబంధించిన ఆనవాళ్లు గానీ ఈరోజు వరకు లభించలేదు. కాలువలో దూకి చనిపోయిందంటున్న భారతి బాడీ 18 రోజులు అయినా లభించక పోవడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు పోలీసు అధికారులను అడిగితే అదే అర్థం కావడం లేదని, అంతుచిక్కడం లేదని పోలీసులు సమాధానం చెబుతున్నారు. భారతి కాలువలో దూకే క్షణం ముందు వరకు రాఘవేంద్ర తో వుందని భర్త చెబుతున్నారు. పోలీసులు మాత్రం భర్తను గానీ, రాఘవేంద్రను గానీ అదుపులోకి తీసుకుని విచారించలేదు. పైగా భారతి తల్లిదండ్రులు,వారి బంధువులు కలిసి వారం తర్వాత ఉల్లిందకొండ యస్.ఐ ని కలిసి నిలదీస్తే అప్పుడు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ పోలీసుల విచారణలో ఈరోజు వరకు ఏ విధమైన పురోగతి కలిగిన సమాచారాన్ని బాధితులకు ఇవ్వలేదు.భారతి మిస్సింగ్ అని కేసు కట్టిన ఉల్లిందకొండ పోలీసులు బాడీ కోసం వెతుకుతూనే… వున్నారు. నియోజకవర్గం శాసనసభ్యురాలు మాత్రం ఫోన్లోనే అధికారులకు ఆదేశాలు ఇస్తూ బాధిత కుటుంబాన్ని మాత్రం ఈ రోజు వరకు పరామర్శించిన దాఖలాలు లేవు. డబ్బు లేని పేదలను పట్టించుకోరా, వారికి న్యాయం అందని ద్రాక్ష అన్నది స్పష్టం అవుతోంది. భారతి మిస్సింగ్ కేసు మరో ముచ్చుమర్రి కేసు గా మహిళా సంఘాలు ప్రజాసంఘాలు గొంతెత్తున్న పోలీసులు మాత్రం మాకు ఇలాంటివి మామూలే అన్నట్లు చూడటం బాధాకరం. భారతి మిస్సింగ్ కేసును చేధించడంలో పోలీసుల తీరుపై శుక్రవారం  కర్నూలు నందలి స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహిళా సంఘాలు ప్రజాసంఘాలు ముక్తకంఠంతో నిరసిస్తూ సోమవారం కర్నూలు కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాలని నిర్ణయించడం  జరిగిoదన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!