ఆ ఘటన పై చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు..? కెఎ పాల్
న్యూస్ వెలుగు సినిమా న్యూస్ : సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. అల్లు అర్జున్ను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. లేదంటే తాను కోర్టులో పిల్ వేస్తామన్నారు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినట్లు తనకు తెలిసిందన్నారు. పుష్కరాలు సహా వివిధ ఘటనల్లో జరిగిన తొక్కిసలాట కారణంగా కొంతమంది మృతి చెందితే చంద్రబాబును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు సరే… మరి చంద్రబాబు కందుకూరులో ర్యాలీ సంగాతెంటని నాడు ర్యాలిలో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోలేదా అన్నారు. 2019లో ఆయన పుష్కరాల్లో స్టంట్స్ చేస్తే 23 మంది కుటుంబాలు పరిస్తితెందన్నారు. ? దేశంలో ఒక్కరికి ఒక్కో చట్టముంధా అని ఆయన అన్నారు. మరి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారా? విచారణకు పిలిచారా? అని నిలదీశారు. బలవంతులైన రాజకీయ నేతలకు ఓ న్యాయం… సాధారణ వ్యక్తులు, నటులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు.