
కురువల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ వెలుగు; కురువ కులస్తులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.. నగరంలో ని ఎం.పి కార్యాలయంలో కల్లూరు మండలం కురువ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురువ సామాజిక వర్గానికి చెందిన తాను ఎం.పి గా పోటీ చేసిన సమయంలో కురువలందరూ పార్టీలకు అతీతంగా ఏక తాటి పైకి వచ్చి తన విజయానికి ఎంతగానో శ్రమించారన్నారు.. కుల బంధువులందరికీ ఎప్పటికి రుణ పడి ఉంటానన్న ఆయన..పార్లమెంటులో కురువల సమస్యల పై గళం విప్పుతానన్నారు..ఇక కురువలు రాజాకీయంగా ఎదగాలని, ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని ఎం.పి పిలుపునిచ్చారు.. అనంతరం ఎం.పి నాగరాజు ను కురువ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు , కల్లూరు మండల కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు..


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar