హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి అండగా ; ఎం.పి బస్తిపాటి నాగరాజు

హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి అండగా ; ఎం.పి బస్తిపాటి నాగరాజు

    హతుడి కుటుంబ సభ్యులకు రూ.50 వేల చెక్కును అందజేసిన ఎం.పి

కర్నూలు, న్యూస్ వెలుగు; ఈరన్న భార్యకు అంగన్వాడీ ఉద్యోగం తో పాటు, పిల్లల చదువుల బాధ్యత తానే తీసుకుంటానన్న ఎం.పి నాగరాజు కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబానికి ఎం.పి బస్తిపాటి నాగరాజు అండగా నిలిచారు.. ఈరన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎం.పి , కుటుంబ సభ్యులకు రూ.50 వేల చెక్కును అందజేశారు.. మృతుడి భార్యకి అంగన్వాడీ ఉద్యోగం ఇప్పించడంతో పాటు , చదువుకుంటున్న ఇద్దరు పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని భరోసానిచ్చారు… అనంతరం మీడియాతో మాట్లాడిన ఎం.పి నాగరాజు ఈరన్నను టిడిపి నాయకులే హత్య చేశారని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారని, హత్య పై పోలీసు విచారణ జరుగుతుందని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయాన్నారు.. చట్టం ఎవరికి చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.. ఇక ఈరన్నను హత్య చేసిన ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.. దాడులు, హత్యలకు పాల్పడితే సొంత పార్టీ నేతలైన సరే ఉపేక్షించేది లేదని సీ.ఎం చంద్రబాబు తెలిపారని, హత్యా రాజకీయాలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహించదన్న ఎం.పి నాగరాజు రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేంద్రప్ప, కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీను, వెంకట రాముడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!