వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి

వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి

తహసీల్దార్  ఆంజనేయలుకు వినతిపత్రం అందచేత 

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)

కల్లూరు, న్యూస్ వెలుగు;  మండల వ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా నాయకులు నీలం సత్యనారాయణ, పరమేష్,విజయ్ కుమార్, కల్లూరు మండలం అధ్యక్షులు మధు సూదన్, సహాయ కార్యదర్శి  మహేష్ గౌడ్ లు ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు సోమవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కి  వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా వ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తూ,జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని అన్నారు.అలాంటి వారిలో కొంతమంది జర్నలిస్ట్ లకు స్వంత ఇళ్ళు లేక,ఏళ్ళ – తరబడి అద్దె ఇళ్ళలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు.అయితే వారి చాలిచాలని ఆదాయంతో స్వంత ఇంటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారు.గత వైసిపి ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి, అమలుచేయడంలో పూర్తిగా విఫలం చెందినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ లు ఇంటి అద్దెలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నారు.కావున తమరు జర్నలిస్ట్ ల పట్ల సహృదయంతో పూర్తిగా పరిశీలించి వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసి,ఇంటి నిర్మాణ వస్తువులపై ప్రత్యేక రాయితీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) మండల నాయకులు,అద్యక్షులు జి. మధు సూధన్ కార్యదర్శి లోకేశ్ కోశాదికారి
జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!