విద్యార్థులకు ఇచ్చే బెల్లం చిక్కిలలో పురుగులు
తుగ్గలి, న్యూస్ వెలుగు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండెకల్లు ఆర్ ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలో నవంబర్ 6న విద్యారులకు ఇచ్చిన బెల్లం చిక్కిలో విద్యార్థుల కు పురుగులు కనిపించాయి. దీనిపై మండల విద్యాశాఖ అధికారి రామ వెంకటేశ్వర్లు గౌడ్ ని సంప్రదించగా దీనిపై సరైన సమాచారం లేదంటూ బుకయించారు. బెల్లం చిక్కి స్కూలుకు ఎవరు పంపిణి చేస్తున్నారో కూడా తనకు తెలియదని రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి బెల్లం చిక్కిలను స్కూలుకు పంపిస్తుంటారని తెలిపారు. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయడం కానీ దాని నివేదికలు ఉన్నత అధికారులకు పంపించడంలో టెక్నిక్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వందల స్కూళ్లలో మండల, జిల్లా విద్యాశాఖ ఆధికారులు కానీ , ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ , ఎలాంటి తనిఖీలు చేయలేదు అన్నది తేటతెల్లమైందని ఎన్ ఎస్ యు ఐ నాయకులూ విజయ్ , విద్యార్ది సంఘలనాయకులు శంకర్ అన్నారు . ఇప్పటి కైనా విద్యార్దులకు అందించే ఆహారం విషయంలో అధికారులు తగు చర్యలు తీసుని జిల్లా వ్యాప్తంగా తనిలు చేపట్టాలని విద్యార్ది సంఘాల నేతలు డిమాండ్ చేశారు.