
యువకులు క్రీడల్లో సత్తా చాటాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు: విద్యార్థులు, యువకులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని, యువత పోటీ కార్యక్రమాల్లో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు..
శనివారం పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పత్తికొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎమ్మెల్సీ బిటి.నాయుడు, పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పత్తికొండలో సౌత్ ఇండియా టోర్నమెంట్ స్థాయిలో 5 రాష్ట్రాలకి సంబంధించిన 42 టీమ్ లతో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసిన పత్తికొండ ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నామన్నారు..ఇలాంటి కార్యక్రమాలు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు.. విద్యార్థులు, యువకులు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు.. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు… మన దేశంలో ఐపిఎల్ మొదలు పెట్టిన తర్వాత ఇండియన్ క్రికెట్ సినారియో మారిపోయిందన్నారు.. ఐపిఎల్ లాంటి క్రీడల నిర్వహణ తర్వాత నిజమైన ప్రతిభ బయటకు రావడం జరిగిందన్నారు.. క్రీడల్లో పాల్గొనడం ద్వారా పోటీతత్వం,క్రమశిక్షణ అలవడుతుందని, విద్యార్థులు,యువత ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందని కలెక్టర్ తెలిపారు..
ఎమ్మెల్సీ బిటి నాయుడు మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ సౌత్ ఇండియా స్థాయిలో 5 రాష్ట్రాలకి సంబంధించిన 42 టీమ్ లను ఆహ్వానిస్తూ నిర్వహించడమనేది కర్నూలు జిల్లా చరిత్రలో మొదటిసారి అన్నారు… ఇలాంటి కార్యక్రమాన్ని పత్తికొండ ఎంఎల్ఏ ఇంత గొప్ప స్థాయిలో నిర్వహించడం అభినందనీయమన్నారు.. మట్టిలో మాణిక్యాలను తీసినట్లుగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతిభ ఉండే వారిని గుర్తించవచ్చునన్నారు.. ఇలాంటి కార్యక్రమాలను యువకులు వినియోగించుకొని అఖిల భారత స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉందన్నారు..
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ యువత, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ బయటికి తీసేందుకు సౌత్ ఇండియా టోర్నమెంట్ స్థాయిలో 5 రాష్ట్రాలకు సంబంధించిన 42 టీమ్ లతో నీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. క్రీడల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
శాప్ ఛైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలి, క్రీడాకారులను అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించే వారీగా తీర్చిదిద్దాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అన్ని రంగాల అభివృద్ధితో పాటు క్రీడారంగం అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు… పిల్లలు మానసికంగా ఉల్లాసంగా ఉండాలన్న, దృఢంగా ఉండాలన్న క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నారా చంద్రబాబునాయుడు గారు ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసే విధంగా క్రీడాకారులను తయారు చేసే విధంగా 2002-03వ సంవత్సరంలో హైదరాబాద్ లో నేషనల్ గేమ్స్ పెట్టడం జరిగిందన్నారు.. ప్రపంచంలో ఉండే క్రీడాకారులందరినీ హైదరాబాద్ కు రప్పించడం జరిగిందని, గచ్చిబౌలి పరిసరాల ప్రాంతాల్లో ది బెస్ట్ అకాడమీ లు తీసుకొని వచ్చారన్నారు.. అప్పుడు పుల్లల గోపీచంద్ గారు అకాడమీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం సహాయ సహకారాలు ఇవ్వడం జరిగిందన్నారు. తద్వారా చాలామంది క్రీడాకారులకు ఒలంపిక్స్ లో పతకాలు వచ్చాయి అంటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్ అన్నారు…
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం 2014 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు గారు మరల ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు, మల్టీ పర్పస్ స్టేడియంలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అప్పటిలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 13 నియోజకవర్గాలకు క్రీడా వికాస కేంద్రాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయంలో పూర్తి అయ్యే దశలో ఉన్న క్రీడా వికాస కేంద్రాలను మధ్యలోనే నిలిపి వేసి క్రీడ రంగాన్ని నాశనం చేశారన్నారు…. వాటిని పూర్తి చేసినట్లయితే ఎంతో మంది పిల్లలు ఇక్కడే శిక్షణ తీసుకొని సర్టిఫికెట్లు, పతకాలు తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యేవారన్నారు..
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ను క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో క్రీడా అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. సిఎం గారు మంచి స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగిందని అందులో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులకు 7 కోట్ల రూపాయలు పారితోషికం, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 5 కోట్ల పారితోషికం, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 3 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడంతో పాటు గ్రూప్-1 ఉద్యోగాన్ని ఇచ్చి క్రీడాకారులను గౌరవించడం జరుగుతుందన్నారు.
నేషనల్, ఆఫ్రో, ఏషియన్, ఖేలో ఇండియా క్రీడలలో పాల్గొని పతకాలు సాధించిన ఇన్సెంటివ్స్ ప్రకటించడం జరిగిందన్నారు.. స్కూల్స్ గేమ్స్ లో నేషనల్ స్థాయిలో పతకాలు సాధించిన వారికి కూడా 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. క్రీడల్లో ఉద్యోగ రిజర్వేషన్ ను 2 శాతం నుండి 3 శాతం వరకు పెంచడం జరిగిందన్నారు. అదే విధంగా యూనిఫాం జాబ్స్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ 5 శాతం, కోచ్స్ గా 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ క్రీడా రంగంపై అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి పాఠశాలకు గ్రౌండ్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక డ్రెస్ కోడ్ ను కేటాయించడం జరిగిందన్నారు. గతంలో క్రీడల నిర్వహణ కోసం ప్రజాప్రతినిధులు నుండి నిధులు కోరే అవకాశం ఉండేదని కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి ముందుగానే 50 శాతం నగదును టిఎ, డిఎ రూపంలో ఇచ్చిన ఏకైక విద్య శాఖ మంత్రి అన్నారు… పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ఆడే క్రీడలకు సంబంధించి మెటీరియల్ ను ఆన్లైన్ లో హెడ్ మాస్టర్స్, పిటి లకు లాగిన్స్ ఇచ్చి సుమారు 18 కోట్ల రూపాయలకు టెండర్ కాల్ ఫార్ చేసిన ఏకైక విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్నారు. ఉపాధి హామీ క్రింద స్కూల్ గ్రౌండ్స్ ను మరమ్మత్తులు చేసేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాఠశాల గ్రౌండ్స్ ను పరిశీలించి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు గ్రామంలో ఎవరైనా క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తిగా ఉంటే వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తొలుత పత్తికొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో టాస్ వేసి క్రీడలను జిల్లా కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బ్యాటింగ్ చేయగా, పత్తికొండ శాసనసభ్యులు బౌలింగ్ చేశారు…
కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్, నాయకులు తిక్కారెడ్డి, తుగ్గలి నాగేంద్ర, సాంబశివా రెడ్డి,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు…