జిల్లా న్యాయ సేవా సదన్

జిల్లా న్యాయ సేవా సదన్

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు,నందు మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ను శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు ఎం. వెంకట హరినాధ్ ఘనంగా నిర్వహించారు. జడ్జి మాట్టాడుతూ ప్రపంచం లో పోర, రాజకీయ, హక్కులకు సంబందించి అంతర్జాతీయ ఒప్పందం పై అవగాహన కల్పించడానికి 1948 నుంచి ఏట డిసెంబర్ 10 న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ను జరుపుకుంటున్నా మని తెలిపారు. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వతంత్రాలకు సంభందించిన అంశమని తెలిపారు. ఈ ఏడాది హక్కులు మన భవిష్యత్ ప్రస్తుతం అనే నినాదం తో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నా మని తెలిపారు. అనంతరం మానవ హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమం లో చీఫ్ లీగల్ అయిడ్ డిఫేన్స్ కౌన్సెల్ యస్.మనోహర్, డి. సి. పి. ఓ. శారద,ఎన్. జి. ఓ. రాయపాటి శ్రీనివాసులు, పోలీస్ అధికారులు, పానల్ న్యాయ వాదులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!