అంతర్జాతీయ పర్యాటక అభివ్రుద్ది కోసమే ఈ కార్యక్రమం : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
దేశీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఈశాన్య ప్రాంతం యొక్క పర్యాటక అభివ్రుద్దికొసం వరల్డ్ హెరిటేజ్ సైట్ కాజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్‌లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ బుదవారం ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ యొక్క 12వ ఎడిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలు-అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మరియు సిక్కిం నుండి పర్యాటక వ్యాపారాలు మరియు వ్యాపారవేత్తలను ఒకచోట చేర్చి, కొనుగోలుదారులు, విక్రేతలు, మీడియా మధ్య సహకారం మరియు పరస్పర చర్యలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఒక కీలక వేదికగా పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర వాటాదారులు ఈ ఈవెంట్‌ని ఈ రాష్ట్రాలలో రొటేషనల్‌గా నిర్వహిస్తున్నందున ప్రత్యేకమైన సాంస్కృతిక, ఈ ప్రాంతం యొక్క చారిత్రక మరియు పర్యావరణ సంపద అని కెంద్ర మంత్రి అన్నారు.
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సామర్థ్యాన్ని హైలైట్ చేయడానికి, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్‌లోని కోహోరా రేంజ్‌లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్‌ను నిర్వహిస్తుందని ఆకాశవాణి ప్రతినిధి నివేదించారు.
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సమక్షంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ రోజు ఉదయం ఈ వార్షిక ఈవెంట్ యొక్క 12వ ఎడిషన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ మరియు దేశీయ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు మరియు హోమ్‌స్టే యజమానులు, టూరిజం సర్వీస్ ప్రొవైడర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు ఒపీనియన్ మేకర్స్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, మీడియా మరియు అంతర్జాతీయ విద్యార్థులతో సహా దాదాపు 400 మంది పార్టిసిపెంట్‌లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.