ఇక ఆన్లైన్లోనే వైద్య సేవలు…సరికొత్త యాప్ ను రూపకల్పన చేసిన పృథ్వి రాజ్

ఇక ఆన్లైన్లోనే వైద్య సేవలు…సరికొత్త యాప్ ను రూపకల్పన చేసిన పృథ్వి రాజ్

న్యూస్ వెలుగు ( కర్నూలు ): ఈ ఆశ ఓపి యాప్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాలను సులభతరం చేసేందుకుగాను ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పృథ్వీరాజ్ తెలిపారు. కర్నూలు కెవి సుబ్బారెడ్డి కాలేజీ ప్రాంగణంలో ఈ యాప్ ను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డితో లాంచ్ చేయడం జరిగిందని వారు వెల్లడించారు.

తెలంగాణలో ఇప్పటికే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఇందులో నమోదు చేసుకోవడం జరిగిందని వీరి ద్వారా సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా వైద్య సలహాలను సూచనలు చేయడమే కాకుండా వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక స్లాట్లను కూడా బుక్ చేసుకునేలా ఈ యాప్ లో వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన డాక్టర్లతో వైద్య సలహాలు సూచనలు వైద్య పరీక్షలను సైతం ఈ యాప్ నమోదు చేసుకున్న వారికి ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కె.వి సుబ్బారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వ్యవస్థాపకులు కేవీ సుబ్బారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వెల్లడించారు.ఆయన కూడా విద్య రంగాలలో విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యా బోధనలు ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి యాప్లను తీసుకురావడంతో గ్రామీణ ప్రాంతంలోని వారికి సైతం మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి అన్నారు.

దీనివల్ల సమయం ఆదా అవుతుందని ప్రత్యేక సమయాల్లో ఎంచుకొని అదే సమయంలో డాక్టర్ని సంప్రదించి తమ ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ యాప్ లో ఒక్కసారి నమోదైన వారికి లైఫ్ టైం సర్వీసులను అందించడం జరుగుతుందని.. రోగులు తమ రిపోర్టులను సైతం ఇందులో పొందుపరచుకునేలా ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు నిర్వాహకులు పృథ్వీరాజ్ సంప్రందించండి సెల్:

6301680400

Author

Was this helpful?

Thanks for your feedback!