కస్టమర్ల సేవలో ‘వైట్ గోల్డ్ ‘  కర్నూలు, అనంతపురంలో వైట్ గోల్డ్ సంస్థలు ప్రారంభం 

కస్టమర్ల సేవలో ‘వైట్ గోల్డ్ ‘ కర్నూలు, అనంతపురంలో వైట్ గోల్డ్ సంస్థలు ప్రారంభం 

న్యూస్ వెలుగు, కర్నూలు : కస్టమర్లకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు గానూ వైట్ గోల్డ్ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి తెలిపారు. ఈ మేరకు కర్నూలు, అనంతపురం జిల్లా కేంద్రాల్లో బుధవారం వైట్ గోల్డ్ సంస్థ బ్రాంచ్ ను హెడ్ ఆఫ్ సేల్స్ మిథున్ శెట్టి ప్రారంభించి మాట్లాడారు. తమ సంస్థ కస్టమర్ల నుంచి బంగారు కొనుగోలు చేసి వారికి మార్కెట్ కు అనుగుణంగా డబ్బులు చెల్లిస్తా మన్నారు.అలాగే బంగారం ఏ బ్యాంకులో తాకట్టులో ఉన్నా ఆ బంగారాన్ని కూడా తమ సంస్థ తాకట్టు నుంచి విడిపించే రోజున ఏ ధర ఉందో ఆ ధర చెల్లించి బంగారాన్ని విడిపిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థకు సంబంధించిన బ్రాంచులను ఇప్పటి వరకు 20 బ్రాంచులు ప్రారంభించామన్నారు. భవిష్యత్ లో ఇంకా ప్రారంభించనున్నట్లు వివరించారు. తమ బ్రాంచుల్లో బంగారం స్వచ్ఛతను శాస్త్రియంగా అంచనా వేసేందుకు జర్మన్ కు చెందిన స్ప్రెక్ట్రో మీటర్లను అందుబాటులో ఉంచామని, ఆ మిషన్ తో తూకం వేస్తామని, అందులో ఎలాంటి తరుగు గానీ, ఇతర పొరపాట్లకు తావు లేకుండా ఉంటుందన్నారు. అందువల్ల కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ సేల్స్ మేనేజర్ ఆనంద్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ డి. సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!