
ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సెల్ ఫోన్లు పంపిణీ
కర్నూలు న్యూస్ వెలుగు: గురువారం కోడుమూరు లో ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ ల పంపిణీ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి మట్లాడుతూ..గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల పోషణ, ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అదేవిదంగా ఎమ్మెల్యే బాల్యవివాహ ముక్తి భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కోడుమూరు ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే దస్తగిరి చేతుల మీదుగా ప్రభుత్వం అందించిన శ్యాంసంగ్ 5జి సెల్ ఫోన్ లను పిడి అధ్యక్షతన పంపిణీ చేశారు. అనంతరం పిడి కే.పి.ఐ ఇండికేటర్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడి విజయ, సిడిపిఓ వరలక్ష్మి దేవమ్మ, సూపర్వైజర్ విజయలక్ష్మి , పద్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

