
భగవన్నామం మానవుడిని పవిత్రుడిని చేస్తుంది
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి. తి. దే.
కౌతాలంలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు, న్యూస్ వెలుగు: భగవన్నామం మానవుడిని పవిత్రం చేసే దివ్య సాధనమని, భగవంతుని నామాన్ని భక్తి, విశ్వాసాలతో జపించినప్పుడు మనస్సు ప్రశాంతతో పొటు హృదయం నిర్మలమవుతుందని, తద్వారా చెడు ఆలోచనలు క్రమంగా తొలగిపోయి, దైవీ గుణాలను పెంపొందించి, సత్యం, ధర్మం, దయ, ప్రేమ వంటి సద్గుణాలను వికసింపజేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారత్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కౌతాలంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు అక్షయ స్వామి సశాస్త్రీయంగా భక్తులందరితో పూజలు నిర్వహింపచేశారు. మూడురోజులపాటు స్థానిక భజన మండలిచే భజనలు, స్వాత్మానందస్వామి ప్రవచనాలు భక్తులను అలరింపచేశాయి. తి. తి. దే. పూర్వ దాససాహిత్యప్రాజెక్టు డైరెక్టు అప్పణ్ణాచారి భక్తులకు సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరావు, జి. సోమశేఖర రెడ్డి, జి. శేషారెడ్డి, బి. గురు రాఘవేంద్ర రెడ్డి, జి. జనార్ధన రెడ్డి, హనుమంతప్ప, అయ్యప్ప, ఒడ్డె రాముడు, టి. లింగారెడ్డి, ఓంకారరెడ్డి, నర్సిరెడ్డి, జి. శ్రీనివాసులు రెడ్డి, జి. ఉసేని, చాకలి తిరుమల, చాకలి ఉసేని, జి. రాఘవ రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

