గ్రామాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: టిడిపి నేతలు మద్దికేర రాము, డీలర్ సుంకన్న

గ్రామాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: టిడిపి నేతలు మద్దికేర రాము, డీలర్ సుంకన్న

తుగ్గలి, జూలై 31 ( వెలుగు న్యూస్ ): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తుగ్గలి మండలంలోని పగిడిరాయి గ్రామంలో శుక్రవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు మద్దికేర రాము, డీలర్ సుంకన్న లు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆయా పథకాల సమాచారంతో కూడిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గ్రామస్తులతో మమేకమైన నాయకులు వారి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజా సేవే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, టిడిపి తుగ్గలి మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు, కొమ్ము వెంకటేష్, బి.సి వెంకటస్వామి, చంద్ర శేఖర్ యాదవ్, మాజీ సర్పంచ్ గుండమయ్య, నక్కల దామోదర్, నక్కల రమేష్, చిన్న గుండమయ్య, మొట్టి సంజన్న, ఆర్.ఎం.పి రంగయ్య, నాగార్జున, పక్కిరప్ప, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS