
గోపూజతో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు (న్యూస్ వెలుగు): ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామం,ఆరోగ్యవంతమైన జీవన విధానం హిందుత్వమని, దేశానికి, సమాజానికి హిందూ జీవన విధానం శ్రీరామరక్ష అని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు కె. శ్రీనివాసులు, గ్రామ పెద్దలు దుగ్గపూడి నాగిరెడ్డి, రాజశేఖర్ చౌదరి, ధర్మప్రచారమండలి సభ్యులు ఆరవీటి రమేశ్ శెట్టి, భజన మండలి అధ్యక్షులు శివశంకర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Authors
Was this helpful?
Thanks for your feedback!

