
గ్యాస్ లీకేజీ ఘటనపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ
కర్నూలు మండలం గొండిపల్లె పరిధిలోని రాయలసీమ అల్యూమినియం అండ్ అలాయ్స్ కెమికల్స్‌లో క్లోరిన్ గ్యాస్ లీకేజీతో కార్మికులు, తాండ్రపాడు గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పిఎస్ రాధాకృష్ణ తెలిపారు. బాధితులను గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌కు తరలించడంపై అభ్యంతరం తెలిపిన సంఘం, కంపెనీపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

