
మాంటిస్సోరిలో మెగా సైన్స్ ఎక్స్పో
కర్నూలు న్యూస్ వెలుగు :కర్నూలు నగరంలో ఏ.క్యాంపు మోంటెస్సోరి పాఠశాలలో బుధవారం నాడు పంచత త్వం పేరుతో మెగా సైన్స్ ఎక్స్పో ను ప్రారంభించారు, మాంటిసోరి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ను పురస్కరించుకొని మెగా సైన్స్ ఎక్స్పోను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి సీయాన్ట్ ఫౌండర్ చైర్మన్ ఐఐటి హైదరాబాద్, డాక్టర్ జి ఎస్ ఎన్ రాజు చాన్సులర్ సెంచూరియన్ యూనివర్సిటీ, శ్రీహరి యార్లగడ్డ చైర్మన్ మహాలక్ష్మి గ్రూప్ పి చంద్రశేఖర్ ఇస్రో మాజీ సైంటిస్ట్ లు హాజరయ్యారు అతిధులు మాట్లాడుతూ మాంటిసోరి స్కూల్ అనేక మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత మోంటెస్సోరి విద్య సంస్థలకు ఉందని వారు కొనియాడారు, రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఐటీ లో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని శ్రద్ధగా విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు, అనంతరం విద్యార్థులు తయారు చేసి సైన్స్ పరికరాలను సైంటిఫిక్ ఎక్స్పోను వారు తిలకించారు కార్యక్రమంలో మాంటిసరి అధినేత డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ మాధవి లత, కే ఎన్ వి రాజశేఖర్, డా.గాయిని రాజశేఖర్, ప్రిన్సిపల్ శశికళ తదితరులు పాల్గొన్నారు, విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాలను అతిధులు తిలకించారు.


