
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి
బండి ఆత్మకూరు వెలుగు న్యూస్ : మండలంలోని గ్రామాలలో అభివృద్ధి జరిగేలా అధికారులు దృష్టి సారించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో దస్తగిరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాలలో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించి అధికారులు ఉద్యోగ ధర్మాలను పాటించాలని కోరారు. విధుల పట్ల అంకితభావం,సమయపాలన, ఇతర అధికారులు,ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే బండి ఆత్మకూరు మండలాన్ని ప్రగతి పథంలో నడిపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏ ఈ వెంకట రాముడు మాట్లాడుతూ బండి ఆత్మకూరు మండల వ్యాప్తంగాఉపాధి హామీ నిధులు సుమారు నాలుగు కోట్ల తో సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ప్రజలకు రాయితీపై సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందనీ విద్యుత్ శాఖ ఏఈ కంబగిరి తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.గతంలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసుకోవాలని హౌసింగ్ ఏఈ వాసుదేవుడు తెలిపారు. గతంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు అవుతున్నాయని జియో టాకింగ్ కోసం వచ్చే హౌసింగ్ సిబ్బంది స్థానిక నాయకులు చెబితేనే జియో ట్యాగ్ చేస్తున్నారని పార్నపల్లి గ్ సర్పంచ్ షబ్బీర్ అహ్మద్ సభ దృష్టికి తీసుకువచ్చారు.ఇలా చాలామంది అర్హులైన గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు రాగల రమణ, ముంతల మధురాని, తహసిల్దార్ ధోని ఆల్ఫ్రెడ్, ఆర్డబ్ల్యూస్ ఎఈ లక్ష్మీ నరసింహ, వైద్యాధికారులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ భావన,వ్యవసాయ అధికారి స్వాతి, ఏపీవో వసుధ, పంచాయతీ సెక్రటరీలు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.