సిపిఎం హెచ్చరిక
కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గనుక కరెంట్ చార్జీలు తగ్గించకుంటే బషీర్బాగ్ ఉద్యమాన్ని పునరావృతం

చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎస్ ఎం డి షరీఫ్, డి అబ్దుల్ దేశాయ్ లు హెచ్చరించారు. కర్నూలు నగరంలో రెండు ప్రాంతాలలో అంబేద్కర్ సర్కిల్ , మండి బజార్ సర్కిల్ లా లో భోగి మంటలలో విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమం, శ్రీనివాసులు, రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆరు నెలల లోపల దాదాపు 20 వేల కోట్ల రూపాయల కరెంటు చార్జీల భారం మోపడమే కాకుండా, స్మార్ట్ మీటర్లను పెట్టాలని ట్రూ పప్ చార్జీల పేరుతో ప్రజల నుండి సంపదన సృష్టించాలని, కుట్ర పన్నుతున్నదని అందులో భాగంగానే, కర్నూలులో ఊరు బయట కార్బెట్ ఫ్యాక్టరీ దగ్గర విద్యుత్ బిల్లుల పెంచడంపై ప్రజాభిప్రాయాన్ని తూతూ మంత్రగా కొనసాగించిందని ,దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని, ప్రజా మధ్యలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలి తప్ప ప్రజలు లేని చోట ప్రజాభిప్రా సేకరణ చేయడం సరైంది కాదని వారు ఘాటుగా విమర్శించారు. విద్యుత్ మీటర్లను మార్చి స్మార్ట్ మీటర్లుగా ఏర్పరిచి ,ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఇంకొక రేటు ,రాత్రి మరో రేటు బిల్లులు వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ప్రజల నడ్డి విరగొట్టడమే తప్ప మరొకటి కాదని వారు దుయ్యబట్టారు. కరెంట్ చార్జీలు పెంచేదే లేదని ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, ఏరు దాటే అంతవరకు ఓడ మల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న అన్నా చందంగా ,చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వ్యవహారం ఉందని, డిప్యూటీ సీఎం దినికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని ,వారు నిప్పులుచేరి గారు. నేను జనసేన పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రజల పైన మోయలేని, విపరీతంగా భారాలు వేస్తున్న ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడు అని వారు ప్రశ్నించారు.ప్రజల పైన భారాలు వేసుకుంటూ కూటమి ప్రభుత్వం గనక పోతే ,సిపిఎం పార్టీగా చూసి సహించేదే లేదని బషీర్బాగ్ ఉద్యమాన్ని పున్నారావృతం చేస్తామని వారు హెచ్చరించారు. భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమంలో స్థానిక నాయకులు జయ్యమ్మ నాగరాజు మహమ్మద్ హుస్సేన్, శాలి భాషా ఈశ్వర్, అజీజ్ ,శ్రీనివాసులు, గోపాల్ చిన్న రాజు, చాంద్ భాషా, బజారన్నా,కోటి, బబులి తదితరులు పాల్గొన్నారు
Thanks for your feedback!