
గ్రామీణ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే పినాక ఉచిత శిక్షణ
విద్యార్థుల్లో ఆంగ్లభాష పట్ల భయాన్ని పోగొట్టడం,ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవడానికి పినాక ఉపయోగపడుతుంది.
బి.యాదగిరి,ఐఆర్ఎస్.ఇన్కమ్ టాక్స్ అడిషనల్ కమిషనర్,హైదరాబాద్.
కర్నూలు , న్యూస్ వెలుగు: విద్యార్థుల్లో ఆంగ్లభాష పట్ల భయాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందడుగు వేసేలా పినాక ఉచిత శిక్షణ తరగతులు రూపొందించామని హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ అడిషనల్ కమిషనర్ బి.యాదగిరి అన్నారు.గత పదిరోజులుగా కర్నూలు నగరంలోని శ్రీలక్ష్మీ హైస్కూల్ లో పినాక ప్రజాసాధికర ట్రస్టు ఆధ్వర్యంలో బి.యాదగిరి,అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ నేతృత్వంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ నిర్వహిస్తున్న పినాక ఉచిత శిక్షణ తరగతులకు ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి హజరై రెండురోజుల పాటు విద్యార్థులకు విద్యాబోధన చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా రాయలసీమ అన్నిజిల్లాల్లో పినాక ఉచిత శిక్షణ తరగతులు వేసవిలో నిర్వహిస్తున్నామని ప్రతి సెంటర్ లో వందమంది విద్యార్థులవరకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గ్రూప్స్,సివిల్స్ గైడెన్స్ కోర్సును మెటీరియల్ తో కూడిన ఉచిత శిక్షణ మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం, అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పిస్తున్నామని గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లభాష పట్ల భయాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యంతో ఆంగ్లభాషలో ఇంటర్వ్యూలను ఎదుర్కునేలా,వేదికలపై ప్రసంగించేలా చేసి జీవితంలో వారు మరింత ఉన్నతంగా ఎదగడానికి దోహదం చేసేలా పినాక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు ఎక్సైజ్ శాఖ సీఐ మంజుల,శ్రీలక్ష్మీ హైస్కూల్ డైరెక్టర్ పీ.దీక్షిత్,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్,ప్రజాపరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కె.బలరాం,గణిత అధ్యాపకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి వేలాదిమంది విద్యార్థులను పినాక ద్వారా ఉచితంగా శిక్షణను ఇస్తూ వారిని ఉన్నతస్థాయిలో నిలిపిన వారి ఆశయం గొప్పదని, విద్యార్థులు శ్రద్థతో వాటిని వినియోగించుకుని గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు.