ఘనంగా  గౌరు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా  గౌరు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులకు

కాపీ రైటింగ్ బుక్స్ అందజేసిన మండల అధ్యక్షుడు డి. రామాంజనేయులు 

కర్నూలు,న్యూస్ వెలుగు ;కల్లూరు మండలం   బొల్లవరం గ్రామంలో పాణ్యం నియోజకవర్గం  ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి  భర్త, నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జీ,టీడీపీ  సీనియర్ నాయకులు   గౌరు వెంకట రెడ్డి  పుట్టినరోజు సందర్బంగా గ్రామంలోని   నీలం రామచంద్రయ్య స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న 220 మంది విద్యార్థిని, విద్యార్థులందరికి కాపీ రైటింగ్ బుక్స్ ను టీడీపీ  కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు. డి. రామాంజనేయులు అందజేశారు.

టీడీపీ ప్రభుత్వంలో  పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. శ్రీ డొక్కా సీతమ్మా  మధ్యాహ్నం భోజనం మెనునూ స్వయంగా వెళ్లి రుచి చూసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో స్కూల్ యాజమాన్యం, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు N. విజయ్ కుమార్, టీడీపీ గ్రామ ప్రధాన కార్యదర్శి BVG. మస్తాన్ నాయుడు, ఉపాధ్యక్షులు B. లక్ష్మన్న,SMC చైర్మన్ D. మస్తాన్ నాయుడు,B. జానకి రాముడు,టీడీపీ గ్రామ పార్టీ సలహా దారులు. BVG. వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు.కాపీ రైటింగ్ బుక్స్ ను దాత N.రామనగౌడు అందించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!